Home ఆంధ్రప్రదేశ్ 10న డీఎస్సీ నోటిఫికేషన్‌ : మంత్రి గంటా

10న డీఎస్సీ నోటిఫికేషన్‌ : మంత్రి గంటా

410
0

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ షెడ్యూల్‌ని ప్రకటించింది. మొత్తం 9,270 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించినట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

ఈ నెల 10న డీఎస్సీ నోటిఫికేషన్‌ని విడుదల చేస్తామన్నారు. నవంబర్‌ 30న పరీక్ష నిర్వహించి.. 2019 జనవరి 3న ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు.

అంతేకాకుండా శనివారం జరిగే కేబినేట్‌ మీటింగ్‌లో పీఈటీ పోస్టుల పెంపుపై ముఖ్యమంత్రితో చర్చించి తుది ప్రకటన విడుదల చేస్తామని వెల్లడించారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు కూడా అర్హులేనంటూ ఎన్సీటీఈ ఉత్తర్వులు జారీచేయడంతో జులైలో వెలువడాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.