చీరాల : విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయని ప్రేమ హాస్పిటల్ ఎండి డాక్టర్ బాబురావు, సుభాషిణి దంపతులు అన్నారు. పట్టణంలోని ఉడ్‌నగర్‌లోని ఆనంద నిలయం బాలికల వసతిగృహంకు టివి ఆదివారం బహుకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు విద్యార్థులు అందరూ బాగా చదువుకుని చదువులో రాణించాలని అన్నారు. ప్రభుత్వం, దాతలు అందించిన సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ తల్లి, దండ్రుల ఆశయాలను నెరవేర్చాలని అన్నారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డన్ విజయకుమారి పాల్గొన్నారు.