Home జాతీయం విఐపిల పేరుతో గంట‌ల త‌ర‌బ‌డి ట్రాఫిక్ ఆపొద్దు

విఐపిల పేరుతో గంట‌ల త‌ర‌బ‌డి ట్రాఫిక్ ఆపొద్దు

344
0

చెన్నై : విఐపిలు వెళ్తున్నారంటూ రోడ్లపై ట్రాఫిక్‌ను ఇక‌మీద‌ట గంటల తరబడి నిలిపి ప్ర‌జ‌ల‌కు అసౌక‌ర్యం క‌లిగిస్తే కుద‌ర‌దు. 10నిమిషాల‌కు మించి ట్రాఫిక్ నిలిపివేయకూడదని మద్రాసు హైకోర్టు శుక్ర‌వారం ఆదేశించింది. ట్రాఫిక్‌ నిలిపే సమయం ఐదు నుండి పది నిమిషాలకు మించకూడదని స్ప‌ష్టంగా ఆదేశించింది. రాష్ట్రపతి, ప్రధాని మినహా గవర్నర్‌, సిఎం, ప్రధాన న్యాయమూర్తి లేక ఇతరులు ఎవరికోసమైనా ట్రాఫిక్‌ను ఆపవద్దని మద్రాస్‌ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది దొరైస్వామి వేసిన పిల్‌ను విచారించిన‌ హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది.