Home ఆధ్యాత్మికం రామానంద ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో ఉచిత వైద్య‌శిభిరం

రామానంద ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో ఉచిత వైద్య‌శిభిరం

519
0

చీరాల : వాడ‌రేవు రామానంద ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో ఆదివారం ఉచిత షుగ‌రు వైద్య‌శిభిరం ఆశ్ర‌మం ఆవ‌ర‌ణ‌లో నిర్వ‌హించారు. గ‌త ఏడాదిన్న‌ర కాలంగా ప్ర‌తినెలా నాలుగో ఆదివారం ఉచిత షుగ‌రు వైద్య‌శిభిరం నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌తినెలా రోగుల‌కు వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించి నెల‌రోజుల‌కు స‌రిప‌డు మందులు పంపిణీ చేస్తున్నారు. ఎప్ప‌టిలాగానే ఫిబ్ర‌వ‌రి నెల వైద్య‌శిభిరంలోనూ 1189మందికి వైద్య‌ప‌రీక్ష‌లు చేశారు. వీరికి నెల‌రోజుల‌కు అవ‌స‌ర‌మైన మందులు అంద‌జేశారు. డాక్ట‌ర్ ఎం రాజేశ్వ‌రి, డాక్ట‌ర్ క‌మ‌లా రాజేశ్వ‌రి, డాక్ట‌ర్ సుధాక‌ర్‌, డాక్ట‌ర్ శ్రీ‌కాంత్ వైద్య‌ప‌రీక్ష‌లు చేశారు.

ఆశ్ర‌మం ఆధ్వ‌ర్యంలో రోగుల‌కు అవ‌స‌ర‌మైన ఆహారం ఏర్పాటు చేశారు. రోగుల‌కు మందులు పంపిణీ చేయ‌డంతోపాటు ఆరోగ్య స‌ల‌హాలు ఇచ్చారు. కార్య‌క్ర‌మంలో ట్ర‌స్టు ఉపాధ్య‌క్షులు కె కృష్ణారావు, ఎన్ సురేష్‌, ఎ సురేష్‌, ఎంజి శంక‌ర‌రావు, పి కామేశ్వ‌ర‌రావు పాల్గొన్నారు. రోగుల‌కు వైఎ ప్ర‌భుత్వ మ‌హిళా క‌ళాశాల, వాడ‌రేవు జెడ్‌పి ఉన్న‌త పాఠ‌శాల విద్యార్ధులు సేవ‌లందించారు.