Home బాపట్ల రోటరీ ఆధ్వర్యంలో సైకిళ్లు పంపిణీ

రోటరీ ఆధ్వర్యంలో సైకిళ్లు పంపిణీ

73
0

చీరాల : రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నార్త్ వెల్జాన్ ప్రాజెక్టు సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక రోటరీ సామజిక భవనం నందు కెజిఎం బాలికోన్నత పాఠశాలలోని ఐదుగురు నిరుపేద విద్యార్థినులకు సైకిళ్ళు మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు చందలూరి బాల వెంకటేశ్వరరావు, పోలుదాసు రామకృష్ణ, బిహేమంత్ కుమార్, మువ్వల వెంకట రమణారావు, దోగుపర్తి వెంకట సురేష్, మామిడాల శ్రీనివాసరావు, జివై ప్రసాద్, చీరాల కృష్ణమూర్తి, జె పుల్లయ్యనాయుడు, ఉపాద్యాయులు పి వేంకటేశ్వర బాబు, ఎ సుబ్బయ్య పాల్గొన్నారు.

పంగులూరు : దాతల సహాయ, సహకారాలను ఉపయోగించుకొని విద్యార్థినిలు చక్కగా చదువుకుని మంచి భవిష్యత్తు పొందాలని రోటరీ క్లబ్ కార్యదర్శి బత్తుల వీరనారాయణ కోరారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నార్త్ వెల్జాన్ ప్రాజెక్టు సౌజన్యంతో ఐదుగురు విద్యార్థినులకు సైకిళ్లను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షుడు కాలేషావళి, క్లబ్ క్యాంప్ చైర్మన్ చిలుకూరి వీరరాఘవయ్య, క్లబ్ సభ్యుడు రాయని రామారావు మాట్లాడారు. రోటరీ మహిళా సాధికారిక ప్రోగ్రాంలో భాగంగా బాలికా విద్యను ప్రోత్సహించేందుకు సైకిళ్లను అందజేస్తున్నట్లు తెలిపారు. పంగులూరు గ్రామానికి చెందిన మేక దివ్యశ్రీ, తన్నీరు అర్చన, జనకవరం గ్రామానికి చెందిన ఏజెండ్ల స్వాతి, చందలూరు గ్రామానికి చెందిన బాచిన జహారిక, కొండ మంజులూరు గ్రామానికి చెందిన బత్తుల మానసకు సైకిళ్లు అందజేశారు. కార్యక్రమంలో రోటరీ సభ్యులు చిలుకూరి ప్రసాద్ నాయుడు, జాగర్లమూడి సుబ్బారావు (జెకెసి), మాజీ అధ్యక్షులు రాయిని వెంకట సుబ్బారావు, గుర్రం ఆంజనేయులు, బాచిన ఆంజనేయులు, విఆర్‌ఒ బాపయ్య పాల్గొన్నారు.