Home ఆంధ్రప్రదేశ్ పరామర్శకు వెళ్లిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అరెస్ట్

పరామర్శకు వెళ్లిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అరెస్ట్

307
0

గుంటూరు :  పాతగుంటూరు పోలీస్‌స్టేషన్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ  దాడి ఘటనకు సంబంధించి కొందరు అమాయకులపై పోలీసులు కేసులు పెట్టారంటూ బాధితులను పరామర్శించేందుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు గుంటూరులో గురువారం పర్యటించారు. దీంతో పోలీసులు మధును అదుపులోకి తీసుకున్నారు. మధును అరెస్టు చేసేఅందుకు పోలీసులు ప్రయటనించారు. ఈ క్రమంలో నిరసనకారులు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. వాహనాలు వెళ్లకుండా నిరసనకారులు రోడ్డుపై బైటాయించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు.

కొందరు యువకులపై పోలీసులు చేయిు చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ యువకుడు స్పృహ తప్పి పడిపోగా అతనిని ఆస్పత్రికి తరలించారు. అరెస్టు చేసిన వామపక్ష నాయకులు, కార్యకర్తలను నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నగరంలో సెక్షన్ 30యాక్టు, 144 సెక్షన్ ప్రకటించారు. పోలీస్ నిబంధనలు అమల్లో ఉన్నందున మహాధర్నాకు అనుమతి నిరాకరించారు. పోలీసు అధికారులు నియంతృత్వ తీరుపై వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.