– మనవడి తరుపున రూ.26 లక్షలు విరాళం-
వెంగమాంబ సత్రంలో భక్తులకు అన్న ప్రసాదం వడ్డన,స్వీకరణ.
తిరుమల : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనుమడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం శ్రీ వెంగమాంబ అన్న ప్రసాదం హాల్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు అన్న ప్రసాధములు స్వీకరించారు.
ఈ సందర్భంగా అన్న ప్రసాదం సేవకులు ముఖ్యమంత్రి కి, వారి కుటుంబ సభ్యులకు టిటిడి సేవా స్కార్ఫ్ ను గౌరవంగా వారి భుజాల చుట్టూ వేశారు.
సీఎం, వారి కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, కుటుంబ సభ్యులు శ్రీవారి అన్న ప్రసాదం హాల్లో భక్తులకు అన్న ప్రసాదములు వడ్డించారు.
చంద్రబాబు తన, మనుమడు నారా డేవాన్స్ పుట్టినరోజు సందర్భంగా రూ.26లక్షల విరాళాన్ని డిడి రూపంలో శ్రీవారి అన్న ప్రసాదం సేవకోసం టిటిడి ఈఓ, తిరుమల జేఈఓలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందచేశారు. ఈ కార్యక్రమంలో మనుమడు దేవాన్ష్, మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు, జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, ప్రజా ప్రతినిధులు, టిటిడి అధికారులు పాల్గొన్నారు.