చెన్నై: గుట్కా స్కాం ఇప్పుడు తమిళనాడును కుదిపేస్తుంది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా సీబీఐ అధికారులు దాడులు చేస్తున్నారు. గుట్కా స్కాం కేసును ఛేదించేందుకు సిబిఐ సోదాలు చేపట్టింది. తమిళనాడు రాష్టర మంత్రి విజయ భాస్కర్, డీజీపీ రాజేంద్రన్‌తో పాటు ఇతర ఉన్నతాధికారుల ఇళ్లలో 150మంది సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏక కాలంలో 40 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. గుట్కా స్కాం కేసులో ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, డీజీపీ రాజేంద్రన్‌కు భారీగా ముడుపులు అందాయనే ఆరోపణల నేపధ్యంలో సోదాలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి.