హైదరాబాద్ : మోతినగర్లోని నీలిమ హాస్పిటల్స్, గోపాలకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెయింట్ థెరిస్సా బ్లడ్ బాంక్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ యాజమాన్య ప్రతినిధి బోయిన వెంకటేశ్వర్లు తెలిపారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికి 20సార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. ఆగస్ట్ 15న ఉదయం 9గంటల నుండి సాయంత్రం 3గంటల వరకు సనత్నగర్లోని నీలిమ హోస్పిటల్ ఆవరణలో శిబిరం జరుగుతుందని తెలిపారు. వివరాలకు 040 21111100, 67311100 నంబర్లలో సంప్రదించాలని కోరారు.