Home క్రైమ్ వివాహేతర సంబంధం అనుమానంతో దాడి

వివాహేతర సంబంధం అనుమానంతో దాడి

373
0

చీరాల : ఈపురుపాలెం పంచాయితీలోని నక్కలవారి పాలెంనకు చెందిన నక్కల రమేష్పై అనుమానంతో అతని సోదరుడు నక్కల అశోక్ దాడి చేశాడు. అన్నదమ్ములు ఇద్దరి మద్య మంచి స్నేహం ఉన్నప్పటికీ గత కొంతకాలంగా రమేష్ పై నక్కల అశోక్ అనుమానం కలిగింది. తన భార్యతో రమేష్ వివాహిత సంబంధము పెట్టుకున్నాడనే అనుమానం పెంచుకున్న నక్కల అశోక్ మంగళవారం రాత్రి సుమారు 8గంటల సమయంలో కోడి కత్తితో దాడి చేశాడు. ఘటనను గమనించిన ఇరుగుపొరుగు వాళ్ళు అశోక్ ని అడ్డుకున్నారు. రమేష్ ని108 సహాయంతో చీరాల ప్రభుత్య ఆసుపత్రికి తరలించారు. రురల్ సిఐ భక్తవత్సలరెడ్డి కేసు నమోదు చేశారు. ముద్దాయిని అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.