చీరాల : రైలు నుండి వృద్దుడు జారిపడిన ఘటన చీరాలలో మంగళవారం జరిగింది. కారంచేడు రైల్వే గేటు సమీపంలో విజయవాడ వైపు వెళుతున్న యశ్వంత్పూర్ రైలు నుండి తూర్పుగోదావరి జిల్లా తిరుమలపురానికి చెందిన జగన్నాధం అనే వృద్ధుడు జారిపడ్డాడు. వృద్దుడు చీరాల మండలం వాడరేవు సమీపంలోని దానవాయిపేటలో ఉన్న తన కూతురు వద్దనే ఉంటున్నాడు. విజయవాడలో వైద్యం చేయించుకునేందుకు రైలులో వెళుతు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. 108సిబ్బంది గాయపడ్డ క్షతగాత్రుడిని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.