Home ఆంధ్రప్రదేశ్ భాగ్య‌న‌గ‌రం అద‌న‌పు క‌మీష‌న‌ర్‌గా అమ్రాపాలి

భాగ్య‌న‌గ‌రం అద‌న‌పు క‌మీష‌న‌ర్‌గా అమ్రాపాలి

443
0

వరంగల్ : క‌లెక్ట‌ర్ విధుల నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న వ‌రంగ‌ల్ అర్భ‌న్ క‌లెక్ట‌ర్ అమ్రాపాలి జిహెచ్ఎంసి అద‌న‌పు క‌మీష‌న‌ర్‌గా బ‌దిలీపై వెళ్లారు. ఈసంద‌ర్భంగా ఆమెకు వ‌రంగ‌ల్ మ‌ద్య‌కోట‌లోని ఏక‌శిలా చిల్డ్ర‌న్స్ పార్కులో జిల్లా అధికారులు ఆత్మీయ వీడ్కోలు స‌మావేశం ఏర్పాటు చేశారు. స‌మావేశంలో ఆమె మాట్లాడుతూ చారిత్రక వరంగల్‌లో సమర్థవంతంగా పనిచేశానని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని చెప్పారు.

కాకతీయ రాజులు పరిపాలించిన ఓరుగల్లులో తాను పనిచేయడం తన అదృష్టమని అన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా మొదటి కలెక్టర్‌గా పనిచేశాన‌న్న‌ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. తోటి అధికారుల సహకారంతో 22నెలల పాటు ఉత్సాహంగా, ప్రణాళికాబద్దంగా పనిచేశానని చెప్పుకున్నారు. వ‌రంగ‌ల్‌ నగరంలో పనిచేసిన కాలంలోనే తాను వివాహం చేసుకోవడం కూడా తన జీవితంలో సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.