న్యూఢిల్లీ : అవినీతి నిరోధక శాఖ చట్టం సవరించింది. 1998నాటి అవినీతి నిరోధక చట్టంలో ఏదైనా ఒక పని ఎవరికైనా అనుకూలంగా చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగి డబ్బు రూపేణా పొందడాన్ని లంచంగా పేర్కొన్నారు. అయితే 2015లో మోడీ ప్రభుత్వం న్యాయ కమీషన్‌కు చట్టసవరణ బాధ్యతలు ఇవ్వడంతో 2016లో సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అదే ఏడాది జులైలో సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర పడింది. తాజాగా ఏపనైనా ఒకరికి అనుకూలంగా చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు స్థిర, చరాస్తుల కొనుగోళ్లు, డౌన్ పేమెంట్లు పొందినా, బంధుమిత్రులకు ఉద్యోగం వచ్చేలా పనిచేసినా, ఖరీదైన వస్తువులను స్వీకరించినా అవినీతి చర్యల్లోకే వస్తుందని ప్రకటించారు. వీటితోపాటు పనిచేసేందుకు మంచం కోరుకున్నా అవినీతి కిందకే వస్తుందని తేల్చారు. లైంగికలబ్ది పొందితే ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే విధంగా అవినీతి నిరోధక సవరణ చట్టం 2018లో పేర్కొన్నారు. ఇక మీదట మంచమెక్కినా జైలు తప్పదు. అవినీతి అధికారులకు ఈ సవరణ ఓ హెచ్చరికే…!