అమరావతి : ఎస్సి బాక్ లాగ్ పోస్టుల పదోన్నతుల ఫైల్ మరుగున పడేసారు. 2014నుండి పంచాయతీ కార్యదర్సులు పదోన్నతులు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 40పోస్టులు పదోన్నతులు ఇవ్వాల్సి ఉండగా 29పోస్టులు మాత్రమే పదోన్నతులు కల్పించారు. మిగిలిన 11పోస్టులు వదిలేశారు. సీనియారిటీ ఉండి పదోన్నతికి అర్హత ఉండి అధికారుల నిర్లక్ష వైఖరితో పంచాయతీ కార్యదర్సులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. పోస్టుల పదోన్నతుల వివరాలు గోప్యంగా ఉంచడం వెనుక కారణాలు సంబంధిత అధికారులు చెప్పాల్సి ఉంది.