చీరాల : కామాక్షి కేర్ హాస్పిటల్ ఆవరణలో ఈనెల 12న ఉచిత ప్లాస్టిక్ సర్జరీ వైద్యశిభిరం జరుగుతుందని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు తెలిపారు. బ్రస్ట్‌సైజు పెంచుట, కనుబొమ్మలను, పెదవులు అందంగా చేయుట, తగ్గని గాయాలు తగ్గించుట, వంకర ముక్కు, చెవి సరిచేయడం, క్యాన్సర్ ద్వారా బ్రెస్ట్‌ను తొలగించిన వారికి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా సహజ బ్రెస్ట్‌ను ఏర్పాటు చేయుట, గ్రహణం, మొర్రి ఆపరేషన్లు, కాలిన గాయాలను తగ్గించడం వంటి వాటిపై వైద్యపరీక్షలు చేస్తారని తెలిపారు. అవకాశాన్ని చీరాల పరిసర గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 9000808198, 9948567413నంబర్లలో సంప్రదించాలని కోరారు.