బాపట్ల : “నేను టిడిపి సభ్యుడిని. నాకున్న పార్టీ గుర్తింపు కార్డుపై నా ఫోటో స్థానంలో వైసిపి నేత జగంపై హత్యా ప్రయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు ఫొటోతో మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.” అంటూ కర్లపాలెం మండలం గణపవరంకు చెందిన టీడీపీ కార్యకర్త నంబురి అంకాలు మీడియా ముందు వాపోయాడు. టిడిపిలో తన సభ్యత్వ కార్డుపై నకిలీ కార్డు తయారు చేసిన ముద్దాయిలను కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రస్తుతం ప్రసార మాధ్యమాల్లో ప్రధానాంశంగా చర్చకు వచ్చింది.