Home ప్రకాశం మున్సిప‌ల్ కార్మికుల సమ్మె జ‌య‌ప్ర‌దం కోరుతూ ర్యాలీ

మున్సిప‌ల్ కార్మికుల సమ్మె జ‌య‌ప్ర‌దం కోరుతూ ర్యాలీ

514
0

చీరాల : మున్సిప‌ల్ పారిశుద్య ప‌నుల‌ను ప్ర‌వేటీక‌ర‌ణ చేస్తూ ప్ర‌భుత్వం ఇచ్చిన జిఒ నెంబ‌ర్ 279ర‌ద్దు చేయాల‌ని కోరుతూ అక్టోబ‌ర్ 4నుండి మున్సిప‌ల్ పారిశుద్య కార్మ‌కులు నిర‌వ‌ధిక స‌మ్మెకు సిద్ద‌మ‌య్యారు. ఈపాటికే మున్సిప‌ల్ అధికారుల‌కు స‌మ్మెనోటీసులు కూడా ఇచ్చారు. జివొ వెనక్కి తీసుకునేవ‌ర‌కు కార్మికుల పోరాటం కొన‌సాగుతుంద‌ని పేర్కొన్నారు. ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల‌పై ప‌న్నుల భారం వేస్తూ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల‌పై భారం ప‌డుతుంద‌ని మున్సిప‌ల్ కార్మిక జెఎసి నాయ‌కులు పేర్కొన్నారు. కార్మికుల స‌మ్మెకు ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని కోరుతూ కార్మిక సంఘాల ఐక్య‌కార్యాచ‌ర‌ణ క‌మిటి ఆధ్వ‌ర్యంలో ర్యాలీ నిర్వ‌హించారు. మున్సిప‌ల్ కార్యాల‌యం నుండి గ‌డియార స్థంభం సెంట‌ర్ వ‌ర‌కు జ‌రిగిన ర్యాలీలో జెఎసి నాయ‌కులు ఏ బాబురావు, శామ్యూల్, డి నాగేశ్వరరావు, ఎం వసంతారావు, మేడ వెంకటరావు, కోటి దాసు, రమణ, వై సింగయ్య పాల్గొన్నారు. కార్మికుల స‌మ్మెకు కాంగ్రెస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు గ‌జ‌వ‌ల్లి శ్రీ‌ను, గుంటి ఆదినారాయ‌ణ సంఘీబావం తెలిపారు.