హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) వివాదం దుమారాన్ని రేపుతుంది. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా నిధులు దుర్వినియోగం చేశారంటూ ఓ ఆంగ్ల పత్రికలో కథనం ప్రచురితమైంది. కథనానికి మద్దతుగా ‘మా’ కార్యదర్శి నరేష్ వ్యాఖ్యలు చేశారు. దీంతో ‘మా’ అసోసియేషన్ రెండుగా చీలిపోయింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో అమెరికాలో చేసిన కార్యక్రమంలో వచ్చిన కొంత డబ్బును శివాజీ రాజా దుర్వినియోగం చేసేందుకు ‘మా’లో మరికొంతమంది సభ్యులు సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
నిధుల దుర్వినియోగ వివాదంలో తన పేరు ప్రస్తావనకు రావడంపై చిరు ఫైర్ ఆగ్రహించినట్లు తెలుస్తోంది. వచ్చే అక్టోబర్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో అమెరికాలో ఈవెంట్ చేసేందుకు `మా` ఫిక్స్ చేసింది. ఈ ఈవెంట్ మహేష్ చేస్తే ‘మా’కు భారీ మొత్తంలో నిధులు వస్తాయి. అయితే వివాదాలకు దూరంగా ఉండే మహేష్ ఈ ఈవెంట్‌ను రద్దు చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘మా’ వివాదం నేపథ్యంలో మహేష్ ఆ నిర్ణయం తీసుకుని ఉంటారని ఆయన అభిమానులు అంటున్నారు. యూఎస్‌లో భారీగా ఫాలోయింగ్ ఉన్న మహేష్ ఈ నిర్ణయం తీసుకోవడంతో ‘మా’కు పెద్ద దెబ్బేనని తెలుస్తోంది.