చెన్నై : కరుణానిధి అస్తమయంతో బావోద్వేగానికి లోనైన లోకనాయకుడు కమల్ హాసన్ తాను హీరోగా నటించిన విశ్వరూపం-2 సినిమా వాయిదా వేసేందుకు సిద్దమయ్యారు. చిత్రం విడుదలకు ఉన్న ఆటంకాలన్నీ ఇటీవలె తొలగిపోవటటంతో ఈ చిత్రాన్ని ఆగష్టు 10న విడుదల చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే తమిళనాడు రాజీయ, సాహిత్య దిగ్గజనేత కరుణానిధి మరణంతో చిత్రాన్ని వాయిదా వేయాలని కమల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రాన్ని వాయిదా వేసేందుకే కమల్ మొగ్గు చూపుతున్నాడంట. ఆగష్టు 15న చిత్రాన్ని విడుదల చేయాలన్న ఆలోచనలో కమల్ ఉన్నట్లు సమాచారం. కమల్ స్వీయ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌తోపాటు, ఆస్కార్ ఫిలింస్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించాయి. విడుదల వాయిదాపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. తెలుగు, తమిళంతోపాటు హిందీలో కూడా ఈ చిత్రం విడుదల చేయనున్నారు.