పిట్టలవానిపాలెం : మండలంలోని వివిధ గ్రామాల్లో అధికారులు గ్రామ దర్శిని కార్యక్రమాన్ని మొక్కుబడిగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 22శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉండగా కేవలం మూడు శాఖల అధికారులు మాత్రమే హాజరవుతున్నారు. మండలంలోని గోకరాజుపల్లిలో గురువారం నిర్వహిస్తున్న గ్రామదర్శిని కార్యక్రమానికి ఎంపీడీవో మేరీ కమలమ్మ, వ్యవసాయ అధికారి లోకేశ్వరి, తాసిల్దార్ సుధారాణి, ఎంఈఓ వెంకటేశ్వరరావు, ఆర్డబ్ల్యుస్ ఎఇ భాష, హౌసింగ్ ఏఈ శ్రీనివాసరావు మాత్రమే హాజరయ్యారు.