Home వైద్యం కామాక్షి కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో చీరాల‌ ఎంజిసి మార్కెట్ ఆవ‌ర‌ణ‌లో ఉచిత వైద్య‌శిభిరం

కామాక్షి కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో చీరాల‌ ఎంజిసి మార్కెట్ ఆవ‌ర‌ణ‌లో ఉచిత వైద్య‌శిభిరం

443
0

చీరాల : ఎంజిసి మార్కెట్ ఆవ‌ర‌ణ‌లో కామాక్షి కేర్ హాస్పిట‌ల్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఉచిత వైద్య‌శిభిరంలో డాక్టర్ చలువాది వెంకటేశ్వర్లు, డాక్టర్ సురేష్, డాక్టర్ పి నాగేంద్రం వైద్య‌ప‌రీక్ష‌లు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ కామాక్షి కేర్ హాస్పిటల్లో ఎన్‌టిఆర్ వైద్య‌సేవ సదుపాయం ఉందని చెప్పారు. ఈ ప‌థ‌కం ద్వారా అన్ని ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి ద్వారా ఆప‌రేష‌న్లు చేస్తున్న‌ట్లు చెప్పారు. శిభిరంలో 115మందికి వైద్య‌ప‌రీక్ష‌లు చేసి అవ‌స‌ర‌మైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హాస్పటల్ మేనేజ‌ర్ సురేష్‌, సిబ్బంది, ఎంజిసి మార్కెట్ సెక్రటరీ అధ్యక్షులు పాల్గొన్నారు.