Home బాపట్ల క్రీస్తు మార్గం అనుసరణీయం : దేవరాజు 

క్రీస్తు మార్గం అనుసరణీయం : దేవరాజు 

34
0

చీరాల : ఏసుప్రభు చూపిన ప్రేమ సేవ, క్షమించే గుణం మార్గంలో నర్సింగ్ వృత్తిలో ఉన్న ప్రతి విద్యార్థులు ఆచరిస్తూ వైద్య సేవ రంగంలో ముందుకెళ్లాలని డాక్టర్ తాడివలస దేవరాజు అన్నారు. చీరాల దండుబాటలోని చీరాల నర్సింగ్ ఆఫ్ కాలేజ్ నందు నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో కాలేజ్ ఎండి చవ్వా దుర్గారెడ్డి, చవ్వ ప్రదీప్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. క్యాండిల్ సర్వీస్, కేక్ కట్ చేశారు. ప్రతి ఒక్క నర్సింగ్ విద్యార్థి ఏసుప్రభు ఆచరించిన విధంగా రోగులకు సేవ చేస్తూ రోగుల ప్రేమని అందిపుచ్చుకుంటూ వారికి సేవ చేస్తూ వైద్యరంగంలో ముందుకు వెళ్లాలని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ దివ్య, పాస్టర్ నెహేమియ, అవుల కల్యాణి, అధ్యాపకులు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.