Home ప్రకాశం క‌రుణానిధికి ఘ‌న నివాళి

క‌రుణానిధికి ఘ‌న నివాళి

418
0

చీరాల : త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి చిత్ర‌ప‌టానికి నాయీ బ్రాహ్మ‌ణ సేవా సంఘం ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం గ‌డియార స్థంభం సెంట‌ర్‌లో ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈసంద‌ర్భంగా హైమా హాస్పిట‌ల్ డాక్ట‌ర్ గుంటుప‌ల్లి సుబ్బారావు మాట్లాడారు. దేశ‌రాజ‌కీయాల్లో విల‌క్ష‌ణ నేత క‌రుణానిధి అని చెప్పారు. 50ఏళ్లు పార్టీ అధ్య‌క్షునిగా 8ద‌ఫాలు ఓట‌మెరుగ‌ని నేత‌గా చ‌ట్ట‌స‌భ‌ల్లో ఉన్న అరుదైన నేత క‌రుణానిధి అని చెప్పారు. కామాక్షి కేర్ హాస్పిట‌ల్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ తాడివ‌ల‌స దేవ‌రాజు మాట్లాడుతూ విద్యార్ది ద‌శ‌నుండే ఉధ్య‌మాల్లో పాల్గొన్న నేత‌ని క‌రుణానిధి అని పేర్కొన్నారు. రాజ‌కీయాల్లో ప్ర‌ముఖ పాత్ర పోషించార‌న్నారు. ఐదు సార్లు ముఖ్య‌మంత్రిగా చేశార‌న్నారు. కార్య‌క్ర‌మంలో చీరాల నాయీబ్రాహ్మ‌ణ సేవా సంఘం అధ్య‌క్షులు కె సుబ్బారావు, ఉపాధ్య‌క్షులు జి స‌త్య‌నారాయ‌ణ‌, వెంక‌ట‌స్వామి, కార్య‌ద‌ర్శి వ‌ల్లూరి శ్రీ‌నివాస‌రావు, స‌త్య‌నారాయ‌ణ‌, గౌర‌వాధ్య‌క్షులు క‌ల‌వ‌కూరి సుబ్బారావు పాల్గొన్నారు.