Home బాపట్ల ప్రజా సమస్యలు గుర్తించండి

ప్రజా సమస్యలు గుర్తించండి

39
0

చీరాల : నియోజకవర్గంలో ప్రజల ఇబ్బందులను స్థానిక నాయకులు గుర్తించాలని ఎంఎల్‌ఎ కొండయ్య కార్యకర్తలు, నాయకులకు సూచించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో చీరాల, వేటపాలెం మండలాల నాయకులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పధకాలకు లబ్ధిదారులును ఆయా ప్రాంతాల నాయకులు అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టిడిపి చీరాల, వేటపాలెం మండలాల అధ్యక్షులు గంజి పురుషోత్తం, బొగ్గుల పార్థసారథి, చీరాల పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, మాజీ జెడ్‌పిటిసి గుద్ధంటి చంద్రమౌళి, పొగడ దండ రవికుమార్ పాల్గొన్నారు.