Home ప్రకాశం వైసిపి కార్యకర్తలపై అక్రమ అరెస్టులకు నిరసనగా ధర్నా

వైసిపి కార్యకర్తలపై అక్రమ అరెస్టులకు నిరసనగా ధర్నా

480
0

చీరాల : వైసిపి కార్యకర్తలపై అధికారపార్టీ వత్తిడితో పెడుతున్న అక్రమ అరెస్టులు ఎత్తేయాలని, అప్రజాస్వామికంగా పోలీసులు అధికారపార్టీ నేతల సిఫార్శులపై ఆధారపడి పనిచేసే పద్ధతి మానుకోవాలని వైసిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి కోరారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఈపురుపాలెం ఎస్ఐ, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రభుత్వ హాస్పిటల్లో కిడ్నీ జబ్బుతో వైద్యం చేయించుకుంటున్న తమపార్టీ కార్యకర్త దేవరపల్లి కుమార్ బాబును బలవంతంగా అరేసు చేసి తీసుకెళ్లారని చెప్పారు. రికార్డులో మాత్రం ఎక్కడో దొరికాదని తప్పుడు నివేదిక చూపారని ఆరోపించారు. పరామర్శకు తాము హాస్పిటల్కు వెళ్లిన సమయంలో తమముందే లాక్కెళ్లి రిపోర్టులో మార్చి రాశారని పేర్కొన్నారు. చీరాల పోలీసులు ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు.

చర్చి వద్ద చిన్న వివాదాన్ని అధికార పార్టీ నేతల వత్తిడితో ఎస్ఐ అనవసర రాద్ధాంతం చేశారని అన్నారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై డిఐజిని కలిసి వివరిస్తామన్నారు. పోలీస్ తీరు మార్చుకోకుంటే ఆందోళన చేయాల్సి వస్తుంది హెచ్చరించారు. ధర్నా అనంతరం తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, గోసాల ఆశీర్వాదం, వైసిపి పట్టణ అధ్యక్షులు బోనిగల జైసన్ బాబు, కొత్తపేట మాజీ సర్పంచి చుండూరు వాసు, మునిసిపల్ కౌన్సిలర్ పొత్తూరి సుబ్బయ్య, కన్నెగంటి శ్యామ్, పొదిలి ఐస్వామి, దేవరపల్లి బాబురావు, అమృతపాణి యువసేన నాయకులు కనపర్తి బజ్జిబాబు, గోసాల అశోక్, వైసీపీ ఎస్సి సెల్ రాష్ట్ర కార్యదర్శి పేర్లి నాని, నాయకులు దక్కుమల్ల ప్రేమ్ కుమార్, బీఎస్పీ నాయకులు వైజి సురేష్ కుమార్, కెవిపిఎస్ అధ్యక్షులు లింగం జయరాజు, కుంచాల పుల్లయ్య, ఎన్ఎం ధర్మ పాల్గొన్నారు.