బాపట్ల : దిగువ భూముల రైతులకు సాగునీరు అందించే లక్ష్యంతో ఎంఎల్సి అన్నం సతీష్ ప్రభాకర్ తన సొంత నిధులతో విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేశారు. రైతన్నకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఎకరాకు సాగు నీరు అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేప్పట్టిన జల దీక్ష స్పూర్తితో బాపట్ల ఈస్ట్ శ్యాంప్ డ్రైనేజి నీటిని పిటి ఛానల్లోకి నీటిని మోటార్ల ద్వారా పంపేందుకు మెటార్లు ఏర్పాటు చేశారు. దీని వల్ల దిగువ ప్రాంతాన ఉన్న సుమారు 17వేల ఎకరాల పంట పొలాలకు నీరు అందుతుంది.