చీరాల : సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల బిటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్ధులకు ఎంప్లాయబిలిటి నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం అంశంపై గురువారం వర్క్‌షాపు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు తెలిపారు. వర్క్‌షాపులో మోటివేషనల్ స్పీకర్, కార్పోరేట్ ట్రైనర్, సైకాలజిస్టు మల్లేష్ విద్యార్ధులనుద్దేశించి మాట్లాడారు. విదేశాల నుండి వచ్చి వర్క్‌షాపులో పాల్గొన్న సురేంద్ర, సత్యసాయి భజన మండలి ట్రస్ట్ ప్రతినిధులకు ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
అన్నమైన మల్లేష్ మాట్లాడుతూ ప్రతివిద్యార్ధి డాక్టర్ ఎపిజె అబ్దుల్‌కలామ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. క్రమశిక్షణ కలిగి ప్రతి విద్యార్ధి త్లదండ్రులు సమాజంలో గౌరవంగా ఉండేలా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలన్నారు. నిరాశకు లోను కాకూడదన్నారు. ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోవాలన్నారు. లోపాలను గుర్తించి స్వీయ ప్రేరణ ద్వారా సరిదిద్దుకోవాలన్నారు.
కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్, డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు చేతుల మీదుగా సత్యసాయి సేవా ట్రస్టు చేస్తున్న సేవా కార్యక్రమాలకు రూ.20వేల విరాళాన్ని ట్రస్ట్ ఛైర్మన్ సురేంద్రకు అందజేశారు.