చీరాల : మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ ఆవరణలోని ది టెక్స్‌టైల్ మర్చంట్స్ అసోసియేషన్ 2018-20సంవత్సరాలకు సంబంధించిన నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. 25మంది కార్యవర్గ సభ్యుల్లో 8మందిని కార్యవర్గ గవర్నింగ్ బాడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షులు చిన్ని లీలాధరరావు, ప్రధమ ఉపాధ్యక్షులు నాళం వెంకట సత్యనారాయణ (వాసవీ సత్యం), ద్వితీయ ఉపాధ్యక్షులు వి శ్యామ్‌ప్రసాద్ (రోటరాక్ట్), కార్యదర్శి పోలిశెట్టి వేణుగోపాలరావు, ప్రధమ సహాయ కార్యదర్శి వేమా బ్రహ్మానందం, ద్వితీయ సహాయ కార్యదర్శి ఎం హరికిషన్, కోశాధికారి తాతా సత్యనారాయణ, ఉపకోశాధికారి పివి శ్రీమన్నారాయణ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా కూర్మాల సాంబశివరావు వ్యవహరించారు.