Home ఆంధ్రప్రదేశ్ బాబు పాల‌న‌లో పారిశ్రామిక రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ : దాసరి రాజా మాష్టారు

బాబు పాల‌న‌లో పారిశ్రామిక రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ : దాసరి రాజా మాష్టారు

503
0

కందుకూరు : అనంతపురంలో నేడు ముఖ్యమంత్రి చంద్ర‌బాబునాయుడుచే కొరియా దేశానికీ చెందిన కియా కార్ల కంపెనీ ఫ్రేమ్ వర్క్ ఇన్ స్టలేసన్ పనులు ప్రారంభోత్సవం జరుగుతుందని టిడిపి కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి, టిడిపి శిక్ష‌ణా శిభిరం డైరెక్ట‌ర్ దాస‌రి రాజా మాస్టారు పేర్కొన్నారు. తెలుగు విజయం ప్రాంగణంలో జరుగుతున్న 153వ బాచ్ శిక్షణ ప్రారంభలో ఆయ‌న‌ మాట్లాడారు.

భారత దేశంలో పూర్తి స్థాయిలో తయారు కాబోతున్న మొట్టమొదటి విదేశీ కారు కియాకారు అని అన్నారు. ఇటీవల డిల్లిలో జరిగిన ఆటోఎక్స్పోలో కియా ప్రదర్శించిన కారే నేడు అనంతపురంలో కియా మోటార్స్ తయారు చేయబోతుందన్నారు. దాదాపు రూ.12వేల కోట్లతో పరిశ్రమ ఏర్పాటు కాబోతుందన్నారు. ఇది రాష్ట్రాన్ని పారిశ్రామిక రాష్ట్రంగా మార్చడానికి దోహద పడుతుందని చెప్పారు. కియా రాకతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయ‌న్నారు. కియాకు అనుబంధంగా మరో 24 సంస్థలు రానున్న‌ట్లు తెలిపారు.

మేక్ ఇన్ ఇండియా పేరుతో మోడీ చేయలేని పనిని చంద్రబాబు చేసి చూపించారన్నారు. విశ్వసనీయతకు చంద్రబాబు మారు పేరని అన్నారు. మొదటగా పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్ర‌హానికి నివాళులు అర్పించారు. ఇటీవ‌లే మంగళగిరిలో ఏపిఐఐసి ఇండస్ర్టీయల్ ఏస్టేట్లో లిండే ఫుడ్ ల్యాబ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించార‌న్నారు. ఇలా పరిశ్రమల పరుగు రాష్ట్రంలో మొదలైంద‌న్నారు.

ఈ శిక్షణకు గుంటూరు జిల్లా గురజాల, తెనాలి, వినుకొండ, ప్రకాశం జిల్లా మార్కాపురం, దర్శి, నెల్లూరు జిల్లా గూడూరు, వేంకటగిరి, సూళ్ళురుపేట నియోజక వర్గాల నుండి గ్రామ, మండల, నగర స్థాయి నాయకులు హాజరయ్యారు. కార్యక్రమంలో శిభిరం కో ఆర్డినేటర్ కాకర్ల మల్లికార్జున్, శిక్షకులు పసుపులేటి పాపారావు, చైతన్య, పరమేశ్వరరెడ్డి పాల్గొన్నారు.