Home విద్య సెయింట్ ఆన్స్‌లో ముగిసిన వైభ‌వ్ – 2018

సెయింట్ ఆన్స్‌లో ముగిసిన వైభ‌వ్ – 2018

467
0
????????????????????????????????????

చీరాల : సెయింట్ ఆన్స్ ఇంజ‌నీరింగ్ కాలేజీలో టెక్నిక‌ల్ సిపోజియం వైభ‌వ్ 2018 విజ‌య‌వంతంగా ముగిసింది. జాతీయ స్థాయిలో రెండు రోజుల‌పాటు టెక్నిక‌ల్ పేప‌ర్ ప్ర‌జెంటేష‌న్‌, వివిధ ర‌కాల ప్ర‌తిభా పోటీలు ఇంజ‌నీరింగ్ విద్యార్ధుల‌కు నిర్వ‌హించిన‌ట్లు క‌ళాశాల సెక్ర‌ట‌రీ వ‌న‌మా రామ‌కృష్ణారావు, క‌ర‌స్పాండెంట్ ఎస్ ల‌క్ష్మ‌ణ‌రావు తెలిపారు. ఈసంద‌ర్భంగా జ‌రిగిన ముగింపు స‌భ‌లో మాజీ మంత్రి వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు, ఎంఎల్ఎ ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌, ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ పి ర‌వికుమార్ మాట్లాడారు. ప్ర‌తివిద్యార్ధి ఉన్న‌త ఆశాలు క‌లిగి ఉండాల‌ని చెప్పారు. ల‌క్ష్య‌సాధ‌న‌కు వెనుకంజ వేయ‌కూడ‌ద‌ని చెప్పారు. వైభ‌వ్ క‌న్వీన‌ర్ డాక్ట‌ర్ పి హ‌రిణి మాట్లాడుతూ సిబ్బంది అంద‌రి స‌మిష్టి కృషితో ప్ర‌ణాళికాబ‌ద్దంగా వైభ‌వ్ నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు. క‌ళాశాల వైస్ ప్రెసిడెంట్ బి ఫ‌ణిరాజు మాట్లాడుతూ క‌ఠిన‌మైన దెబ్బ‌లు తింటేనే రాయి శిల్ప‌మ‌వుతుంద‌ని, అలాగే విద్యార్ధులు క‌ఠిన‌మైన పాఠ్యాంశాలు చేనేర్చుకునేందుకు క‌ష్ట‌ప‌డాల‌ని చెప్పారు. అప్పుడే ఉన్న‌త స్థాయికి వెళ‌తార‌ని చెప్పారు.

మాజీ మంత్రి వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ త‌క్కువ ఖ‌ర్చుతో పేద విద్యార్ధుల‌కు నాణ్య‌మైన సాంకేతిక చ‌దువులు అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు చెప్పారు. ఎంఎల్ఎ ఆమంచి కృష్ణ‌మోహ‌న్ మాట్లాడుతూ వెనుక‌బ‌డిన గ్రామీణ ప్రాంతంలో ఇంజ‌నీరింగ్ కాలేజిని స్థాపించి పేద‌ల‌కు సాంకేతిక చ‌దువులు అందిస్తున్న క‌ళాశాల యాజ‌మాన్యాన్ని అభినందించారు. అనంత‌రం జ‌రిగిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాల్లో సినీన‌టులు తార‌క్‌ర‌త్న‌, మిమిక్రీ క‌ళాకారుడు శివారెడ్డి, సినీగాయ‌కులు హేమ‌చంద్ర‌, శ్ర‌వాణ‌భార్గ‌వి, సింహ‌, ర‌మ్య‌బెహ‌రా, వాణి, క‌ళాశాల క‌మిటి స‌భ్యులు పి సాంబ‌శివ‌రావు, డాక్ట‌ర్ సి సుబ్బారావు, ఆర్‌వి ర‌మ‌ణ‌మూర్తి పాల్గొన్నారు.