Home ఆంధ్రప్రదేశ్ సేవా కులాల మాన్యం భూములను పునరుద్ధరిస్తా : జగన్

సేవా కులాల మాన్యం భూములను పునరుద్ధరిస్తా : జగన్

530
0

చీరాల : సేవా కులాల మాన్యం భూముల్ని పునరుద్ధరిస్తామని ప్రకటించిన జగన్ అన్నారు. అన్యాక్రాంతమయిన మాణ్యం భూములని వెనక్కు ఇప్పించండని జగన్ కు రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పొటికలపూడి జయరాం వినతి పత్రం అందజేశారు. చీరాల ప్రజా సంకల్ప యాత్రలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలసి సేవా కులాల సమస్యలని వివరించారు. జయరాం చెప్పిన వివరాలను జగన్ ఓపిగ్గా విన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆదరించండి … అండగా ఉంటానని కోరారు.

అవకాశం ఉన్న గ్రామాల్లో భూముల్ని వెనక్కిప్పిస్తా మన్నారు. వీలుకాని చోట కులం ఉమ్మడిగా భూములని కొనిస్తామన్నారు. పనిముట్లు యిస్తే సరిపోదని భూములిస్తే కులాలూ,వృత్తులు బతుకుతాయని జగన్ చెప్పారు .అధికారంలోకి వచ్చాక రజక, నాయి బ్రహ్మణ , కుమారి, కమ్మరి, విశ్వబ్రాహ్మణ ,పశువుల బీడు , పీర్ల మాణ్యం తదితర మాణ్యం భూములని పునరుద్ధరిస్తామని జగన్ ప్రకటించారు .