చీరాల : యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడిన ఘటన చీరాల పట్టణం విఠల్ నగర్లో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న గుడూరి జాన్ విల్సన్ (35)తన ఇంట్లో ఉరివేసుకున్నాడు. బెడపై స్టూల్ పెట్టుకుని చీరతో ఫ్యాన్ హుక్ కు తగిలించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం అర్ధరాత్రి జరిగి ఉంటుందని భావిస్తున్నారు. బుధవారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒకటపట్టన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్య కు కారణాలు తెలియాల్సి ఉంది.