చీరాల : 10వ తరగతి విద్యార్ధులకు ఫిబ్రవరి 24నుండి మార్చి 9వరకు డిసిఇబి రూపొందించిన ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎంఇఒ కె లక్ష్మినారాయణ తెలిపారు. మండలంలోని 39పాఠశాలల ప్రధానోపాధ్యాయులను పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతిరోజూ గంట ముందుగా ఎంఆర్‌సి భవనానికి వచ్చి అక్కడ బద్రపర్చిన ప్రశ్నాపత్రాలను ఆరోజుకు సంబంధించిన ప్రశ్నాపత్రం తీసుకెళ్లి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్షల పర్యవేక్షణకు ఆర్‌వి రమణ, కె వీరాంజనేయులు, పి భానుచంద్రమూర్తి, వై మల్లమందేశ్వరరావు, పి సురేష్‌తో కూడిన బృంధం నియమించినట్లు తెలిపారు.
విద్యార్ధినీ విద్యార్ధులకు సృజనోత్సవం ప్రతిభా పరీక్ష
విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈనెల 24న చీరాల కెజిఎం బాలికోన్నత పాఠశాల ఆవరణలో సైన్స్ ప్రతిభా పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎంఇఒ కె లక్ష్మినారాయణ తెలిపారు. మండలంలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల నుండి ఎంపిక చేసిన ఆరుగురు 9వ తరగతి విద్యార్ధులను పరీక్షలకు పంపాలని సూచించారు.