Home ప్రకాశం గ్రామ వికాస్ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ

గ్రామ వికాస్ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ

341
0

చీరాల : గ్రామ వికాస్ పీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తోటవారిపాలెం ఇందిరానగర్ కాలనిలో బుధవారం ఒక్కొక్క ఇంటికి ఐదు చొప్పున మొక్కలు పంపిణీ చేశారు. మండల వైస్ ఎంపీపీ నాదెండ్ల కోటేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీసుకున్న మొక్కలను నాటి వాటిని పెంచాలని చెప్పారు. మొక్కల తోపాటు ఒకరికి ట్రై సైకిల్ ఇచ్చారు. కార్యక్రమంలో పౌండేషన్ డైరెక్టర్ జాకబ్, యోహాను కమ్యూనిటీ ఆర్గనైజేజర్ దేవదానం, కాంతారావు, జాషువ పాల్గొన్నారు.