Home విద్య సెయింట్ పాల్ స్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సెయింట్ పాల్ స్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

373
0

చీరాల : సెయింట్ పాల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరు వాసు పాల్గొన్నారు. విద్యార్థుల నుద్దేశించి మాట్లాడుతూ జాతీయ నాయకుల స్పూర్తితో విద్యార్థులు సామాజిక దృక్పథంతో చదువుకుని దేశాభివృద్ధి కి పాటుపడాలని చెప్పారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ డి లూధర్ శాస్త్రి, కరస్పాండెంట్ డి నిత్యానందం, విశ్రాంత ఉపాధ్యాయులు లింగం జయరాజు, ప్రిన్సిపాల్ రాణి పాల్గొన్నారు.