చీరాల : పదోతరగతి విద్యార్ధులు ప్రణాళికా బద్దంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎంఇఒ కె లక్ష్మినారాయాణ కోరారు. సోమవారం ఆయన పట్టణంలోని వివిధ ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలను తనిఖీ చేశారు. అందరు విద్యార్ధులు ఉత్తీర్ణులు కావాలని సూచించారు. పరీక్షలు రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళుకువలు వివరించారు. ఆయన వెంట ఉపాధ్యాయులు పవని భానుచంద్రమూర్తి, ఎంఎస్ వరప్రసాద్, జయచంద్రబాబు, సుబ్బారెడ్డి ఉన్నారు.