బాపట్ల : ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను ఎంఎల్సి అన్నం సతీష్ప్రభాకర్ మంగళవారం లబ్దిదారులకు అందజేశారు. బాపట్ల మండలం పిన్నిబోయినవారిపాలెంకు చెందిన నక్కల యెహోషావకు రూ.10వేలు, దబ్బకుటి శ్రీనివాసరావుకు రూ.18వేలు, పిన్నిబోయిన ఆదిలక్ష్మికి రూ.25వేలు విలువైన చెక్కులను అందజేశారు. మెరుగైన వైద్యం చేయించుకునేందుకు నిధిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్ధిక ఇబ్బందులతో అనారోగ్యంతో బాధపడే అర్హులైన లబ్దిదారులు ముఖ్యమంత్రి సహాయనిధికి ధరకాస్తు చేసుకోవచ్చని చెప్పారు.