చీరాల : రాష్ట్ర ప్రభుత్వం మద్యాహ్న భోజన కేంద్రాలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకంపై ఆధారపడి అనేకమంది ఉపాధి పొందుతున్నారని, ఈపాటికే పథకం నిర్వహణకు ముందుగా పెట్టుబడి పెట్టి బిల్లులురాక ఇబ్బందులు పడుతున్నారని మద్యాహ్న భోజన పథకం సంఘం జిల్లా కన్వీనర్ పెంట్యాల కల్పన పేర్కొన్నారు. పథకం నిర్వాహకుల సమస్యలపై ఈపెల 19న తహశీల్దారు కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.