చీరాల : పరిసర ప్రాంత ప్రజలు కామాక్షి కేర్ హాస్పిటల్ ఆవరణలో జరిగే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు కోరారు. నడుం నొప్పి, చెయ్యి కాలు జాలు గా అనిపించడం, వెన్నుపూస వంకర, మెడ నిలబడకపోవటం, డిస్క్ ప్రాబ్లమ్ తో బాధపడేవాళ్లు, వెన్నెముక ఆపరేషన్లు చేయించుకుని నొప్పులు తగ్గక ఇబ్బందిపడేవాళ్లు కామాక్షి కేర్ హాస్పిటల్ నందు ఈరోజు డాక్టర్ పి నాగేంద్రం (స్పైయిన్ సర్జన్) కు చూపించి వైద్య సేవలు పొందాలని కోరారు. శిభిరానికి వచ్చేటప్పుడు మీ పాత రిపోర్టులతో సంప్రదించాలని సూచించారు. వివరాలకు ఆకురాతి రేవంత్‌ను 9948567413నంబరులో సంప్రదించాలని కోరారు.