Home జాతీయం మోడీకి రాహుల్ దిమ్మదిరిగే కౌంటర్ 

మోడీకి రాహుల్ దిమ్మదిరిగే కౌంటర్ 

474
0

ఢిల్లీ : మొన్నటి ఎన్నికల్లో నరేంద్ర మోడి ”నాది 56అంగుళాల చాటి” అంటూ చేసుకున్న ప్రచారం చూసిన జనం నమ్మి ఆయనకు అధికారం కట్టబెట్టారు. అయితే ఈ నాలుగేళ్లలో ఏ విషయంలోనూ ఆ భారీ ఛాతిని మోడీ వుపయోగించలేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. దేశం యావత్తు మొన్నటి ఎన్నికల్లో మోడీకి ఎంతగా మద్దతు పలికిందో సరిగ్గా నాలుగేళ్ల తర్వాత మోడీ మీద అంతకు మించిన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ వ్యతిరేకతకు భయపడే ముందస్తు, జమిలి అంటూ బీజేపీ రకరకాల ఎత్తులు వేస్తోంది. విపక్షం బలపడడంతో మోడీ వేస్తున్న ఎత్తులన్ని చిత్తవుతున్నాయి. ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచార నేపథ్యంలో అన్ని పార్టీలు విమర్శల జడిని పెంచాయి. మోడీని, బీజేపీని టార్గెట్ చెస్తూ కాంగ్రెస్ కూడా సమరానికి సన్నద్ధమైనది.

మోడీ చెప్పిన మాటలను ఉదహరిస్తూ కాంగ్రెస్ దాడిని ఉధృతం చేసింది. ‘ముస్లిం మహిళలను’ నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పవర్‌ఫుల్ కౌంటర్ ఇచ్చారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ప్రధానికి లేఖాస్త్రం సంధించారు. ప్రభుత్వం ముందుకొస్తే ఈ బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమని రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ అంశంపై రాహుల్ ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘మహిళా సాధికారత కోసం తాను పోరాడుతున్నానంటూ ప్రధాని చెప్పుకుంటున్నారు.  తన మాటలకు కట్టుబడి పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి…’’ అని డిమాండ్ చేశారు.

2014 మేనిఫెస్టోలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ హామీ ఇచ్చిందనీ, ఇప్పుడు ఆ ఆలోచనే విరమించుకున్నట్టు కనిపిస్తోందని సందేహం వ్యక్తం చేశారు. రాహుల్ ఇంత తీవ్రంగా స్పందించడానికి మోడీ చేసిన వ్యాఖ్యలే కారణం. కాంగ్రెస్ ముస్లింల పార్టీ అంటూ రాహుల్ అన్నట్టు ప్రధాని మోడీ వ్యాఖ్యానించడంపై ఇటీవల వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌లో ఈ నెల 14న జరిగిన ఓ ర్యాలీలో ప్రధాని ప్రసంగిస్తూ.. ‘‘కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పినట్టు ఓ న్యూస్ పేపర్లో చదివాను. దీనిపై నేను ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా… సహజ వనరులపై ముస్లింలకే తొలి హక్కు ఉందంటూ ఇలాగే మాట్లాడారు..’’ అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందంటూ విమర్శించిన మోడీ ముస్లిం మహిళలను ఆ పార్టీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ‘‘నేను ఒక్కటే అడగాలనుకుంటున్నా.. ఆ పార్టీ కేవలం ముస్లిం పురుషులకేనా లేక మహిళలకు కూడానా?’’ అని ప్రధాని మోడీ ప్రశ్నించడంతో కాంగ్రెస్, రాహుల్ అగ్గిమీద గుగ్గిలమై మండిపడుతున్నారు.