విజయవాడ : అంతర్జాతీయ ఇంజనీరింగ్ సంస్థలో ప్రకాశం జిల్లా చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల సభ్యతం పొందినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఆంద్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 16న విజయవాడ గేట్‌వే హోటల్‌లో జరిగిన సమావేశంలో అంతర్జాతీయ సంస్థ అయిన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఎపి చాప్టర్‌లో సభ్యత్వం నమోదు పత్రంపై ఎగ్జికూటివ్ డైరెక్టర్ వేదుల కృష్ణ, ఎపిఎస్ఎస్‌డిసి ఎండి అండి సిఇఒ కోగంటి సాంబశివరావు, ఇంజనీరింగ్ డివిజన్ హెడ్ డాక్టర్ టి లక్ష్మి చేతుల మీదుగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ సభ్యత్వం పొందారని తెలిపారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ రవికుమార్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్‌లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించటానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఇసిఇ హెచ్ఒడి డాక్టర్ కె జగదీష్‌బాబు పాల్గొన్నారు.