Home విద్య ఒంగోలు పాల ఉత్పత్తి కేంద్ర సందర్శనలో ఆల్టస్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు

ఒంగోలు పాల ఉత్పత్తి కేంద్ర సందర్శనలో ఆల్టస్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు

691
0

ఒంగోలు : చీరాల ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలోని ఆల్టస్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు జిల్లా కేంద్రంలోని పాల ఉత్పత్తి కేంద్రాన్ని సందర్షించారు. పాల సేకరణ, పాల శీతలీకరణ, పాలు నిల్వ చేయుట, నెయ్యి వేరు చేయుట వంటి అంశాలను తెలుసుకున్నారు.

అనంతరం ఒంగోలు పబ్లిక్ స్కూల్లో జరిగిన ఆకృతి హుమానిటీస్ కల్చరల్ ఎక్స్పో – 2018లో పాల్గొన్నారు. తోలుబొమ్మలాట, షేక్స్పియర్ జీవిత చరిత్ర, ప్రపంచంలో వివిధ దేశాల సంస్కృతి, సాంప్రదాయాలు తెలుసుకున్నారు. పొంపేయి పట్టణం, బర్గ్ కలిహిప్య, సిడ్నీ ఓపెరా హౌస్, హారప్పా భిన్నత్వంలో ఏకత్వం, ప్రిబల్ గ్రామం, ఎడారి అందం వంటి కొత్త అంశాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పి కదిరేషన్, అడ్మిషన్ల సంచాలకులు మోహన్ చౌదరి, సంజయ్, ఆశిమా, ఆయేషా, తులశి పాల్గొన్నారు.