చీరాల : సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో మార్చి 9, 10తేదీల్లో జాతీయ స్థాయి టెక్నికల్ సిపోజియం వైభవ్ 2018పోటీలు జరుగనున్నట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. వైభవ్ నందు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.
పోటీల్లో గెలుపొందిన విజేతలకు రూ.5లక్షల విలువైన బహుమతులు అందజేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ తెలిపారు. వైభవ్‌కు సిఎస్ఇ హెచ్ఒడి డాక్టర్ పి హరిణి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. పేపర్ ప్రజెంటేషన్, ప్రాజెక్ట్ ప్రజెంటేషన్, స్పర్ధ, స్వింగ్‌జర, నాక్‌జపుల్, మినిమిలిటియా, హాసియో, ఖోజ్‌ఖజానా, ఐడియల్, నా ఈవెంట్ నా ఇష్టం విభాగాల్లో పోటీలు జరుగుతాయని తెలిపారు.