టంగుటూరు : కొండేపి నియోజవకర్గంలోని వివిధ గ్రామాల్లో చౌదరి యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. తొమ్మిది రోజులు పూజలందుకున్న గణేష్ విగ్రహాలను నిమజ్జనానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసందర్భంగా గణేష్ ఉత్సవ పందిళ్లవద్ద ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కొన్నిచోట్ల హోమాలు నిర్వహిస్తున్నారు. స్వామికివారికి పూజల అనంతరం అన్నసమారాధన నిర్వహించారు.
నియోజకవర్గంలోని అన్నీ గ్రామాల్లో జరుగుతున్న గణేష్ ఉత్సవాల్లో వైఎస్ఆర్‌సిపి నియోజకవర్గ నాయకులు వరికూటి అశోక్‌బాబు తన అనుచరులతో పాల్గొన్నారు. గణేషునికి ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల ఆశీస్సులు అందుకున్నారు. ఈసందర్భంగా ఆయన గ్రామాల్లో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ తిరగడం, రాజకీయంగా ఆయనపై జరుగుతున్న వేధింపులను ప్రజలు అడిగి తెలుసుకోవడం కనిపించింది. ఎన్ని కష్టాలొచ్చిన ఆయనవెంటనే ఉంటామని జనం నుండి వస్తున్న బరోసాతో ఆయన ముందుకు సాగుతానని చెప్పారు.