చీరాల : కాకినాడ జేఎన్టీయూ పరిధిలోని ఇంజినీరింగ్ కాలేజీల ఇసీఈ విద్యార్థుల ఎంట్రిక్స్ పోటీలు నరసరావుపేటలో సెప్టెంబర్ 17న నిర్వహించారు. పోటీల్లో టెక్నికల్ క్విజ్, డాన్స్ పోటీల్లో చీరాల సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీ ఇసీఈ విద్యార్థులు ప్రధమ, ద్వితీయ స్థానాలు సాధించినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణ, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు.
క్విజ్ పోటీల్లో జేఎన్టీయూ పరిధిలోని వివిధ కాలేజీల నుండి 60టీములు పాల్గొన్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ తెలిపారు. తమకళాశాల విద్యార్థులు ఎస్ రాజశేఖర రెడ్డి, టి సాయి గజేంద్రరావు జట్టు మొదటి బహుమతి, ఎస్కె షర్మిల, వి దివ్య జట్టు ద్వితీయ స్తానం సాధించారని తెలిపారు. డాన్స్ పోటీలకు 30జట్లు పోటీపడ్డట్లు తెలిపారు. ఎస్ కమల్ బాషా మొదటి బహుమతి, బి చందు, జె రవితేజ, పి తాజుద్దీన్ ఖాన్ జట్టు ద్వితీయ బహుమతి పందారని తెలిపారు. బహుమతులు పొందిన విద్యార్థులను హెచ్ఒడి డాక్టర్ కే జగదీష్ బాబు అభినందించారు.