వలేటివారిపాలెం : వల్లేటివారిపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాటశాలలో ఆవరణలో ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎంఎల్‌సి కరణం బలరామకృష్ణమూర్తి, కందుకూరు ఎంఎల్ఎ పోతుల రామారావు, కొండపి ఎంఎల్ఎ డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, అటవీశాఖ అభివృద్ధి కమిటీ చైర్మన్ దివి శివరాం ఆదివారం ప్రారంభించారు. వైద్యశిభిరంలో పరీక్షలు చేసిన వైద్యులు రోగులకు అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. మెరుగైన వైద్యం, శస్ర్తచికిత్సలు అవసరమైన వారికి ఒంగోలులోని కిమ్స్ వైద్యశాలలో రాయితీపై చేస్తామని చెప్పారు.