Home విద్య సెయింట్ ఆన్స్‌లో ఎంబెడెడ్ సిస్ట‌మ్స్‌పై శిక్ష‌ణా త‌ర‌గ‌తులు

సెయింట్ ఆన్స్‌లో ఎంబెడెడ్ సిస్ట‌మ్స్‌పై శిక్ష‌ణా త‌ర‌గ‌తులు

325
0

చీరాల : ఎపి స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పోరేష‌న్ ఆధ్వ‌ర్యంలో సెయింట్ ఆన్స్ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లోని ట్రైనింగ్ సెంట‌ర్‌లో ఎంబెడెడ్ సిస్ట‌మ్స్‌పై మూడు రోజుల శిక్ష‌ణా కార్యక్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్లు క‌ళాశాల సెక్ర‌ట‌రీ వ‌న‌మా రామ‌కృష్ణారావు, క‌ర‌స్పాండెంట్ ఎస్ ల‌క్ష్మ‌ణ‌రావు తెలిపారు. ఎల‌క్ర్టానిక్ అండ్ కమ్యునికేష‌న్ విభాగం విద్యార్ధుల‌కు ఈనెల 28నుండి 30వ‌ర‌కు శిక్ష‌ణ ఉంటుంద‌ని ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ పి ర‌వికుమార్ తెలిపారు. అవ‌కాశాన్ని విద్యార్ధులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కార్పోరేష‌న్ ఇన్‌ఛార్జి ఎ తిరుప‌త‌య్య‌, ఎం ఉమామ‌హేశ్వ‌ర‌రావు, బి మ‌హీద‌ర్‌, డి క‌ళ్యాణ్‌కుమార్‌, ఎస్ శ్రావ‌ణ్‌కుమార్ పాల్గొన్నారు.