వేటపాలెం : సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలోని నైపుణ్యాభివృద్ది శిక్షణా కేంద్రంలో ఎంజెపి ఎపి బిసి వెల్ఫేర్ రెసిడెన్షియనల్ పాఠశాల విద్యార్ధులకు శిక్షణా తరగతులు ప్రారంభించినట్లు కళాశాల కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. పాఠశాలకు చెందిన 32మంది విద్యార్ధులకు సీమెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుందని ఎపి స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ తెలిపారు. ఈనెల 8నుండి 18వరకు 10రోజులపాటు శిక్షణ ఉంటుందని తెలిపారు. దేశంలో 70శాతంగా ఉన్న యువత వృత్తివిద్యాకోర్సుల్లో నైపుణ్యం సాధిస్తే 2020నాటికి అగ్రదేశంగా నిలబెట్టవచ్చని పేర్కొన్నారు.
కార్యక్రమంలో బిసి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్ సొసైటీ సెక్రటరీ ఎ కృష్ణమోహన్ మాట్లాడుతూ నాలెడ్జి యుగంలో ప్రతిఒక్కరు వైవిద్యమైన నైపుణ్యాలను పెంపొందించుకుంటేనే అభివృద్ది చెందగలరని చెప్పారు. ఇలాంటి శిక్షణ దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రసన్నాంజనేయులు, బిసి వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాసులు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ ఇంద్రనీల్ పాల్గొన్నారు.