Home ప్రకాశం ఎల్ఐసి ఉద్యోగుల సంఘం వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ర‌క్త‌దానం

ఎల్ఐసి ఉద్యోగుల సంఘం వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ర‌క్త‌దానం

392
0

చీరాల : ఎల్ఐసిపి ఉద్యోగుల సంఘం ఎఐఐఇఎ 68వ‌ వ్యవస్థాపక దినోత్సవ సందర్బముగా ఎల్ఐసి కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో ఎల్ఐసి ఉద్యోగులు బుధ‌వారం ర‌క్త‌దాన శిభిరం నిర్వ‌హించారు. శిభిరాన్ని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ నెల్లూరు డివిజ‌న్‌ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ ఆర్ నగేష్‌, జిల్లా జాయింట్ సెక్రటరీ కామ్రేడ్ ఆర్వియస్ రామిరెడ్డి ప్రారంభించారు. గురువారం దండుబాట‌లోని కోట‌య్య వృద్దాశ్ర‌మంలోని వృద్దుల‌కు, అనాధ బాల‌ల‌కు మ‌ద్యాహ్న భోజ‌నం ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో ఎఐఐఇఎ చీరాల బ్రాంచ్ సెక్రటరీ కామ్రేడ్ భూపతి నాగేశ్వర రావు, అధ్యక్షులు కామ్రేడ్ టి విజయకుమార్, వైస్ ప్రెసిడెంట్ కామ్రేడ్ సాల్మన్, జాయింట్ సెక్రటరీ కామ్రేడ్ వై పూర్ణచంద్రరావు, సిఐటియు చీరాల డివిజేన్ సెక్రటరీ కామ్రేడ్ యన్ బాబురావు, ఎఒ సతీష్, ఎంబి నెహ్రు పాల్గొన్నారు.