చీరాల : ప్రకాశం జిల్లా చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఏప్రిల్ 23న ప్లక్స్‌టెక్ సొల్యూషన్స్ కంపెనీ యుఎస్ైటి రిక్రూటర్ ఉద్యోగాల కోసం ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. బిటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు సోమవారం ఉదయం 9గంటలకు కళాశాలలోని రిక్రూట్‌మెంట్ ఫెసిలిటి సెంటర్‌కు హాజరు కావాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ తెలిపారు. అర్హత కలిగిన విద్యార్ధులు వివరాల కోసం కళాశాల ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఎన్ పూర్ణచంద్రరావును సంప్రదించాలని కోరారు.